పిల్లల విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి చేతికి అందే చిన్న వస్తువులు వారు నోటిలో పెట్టుకుంటారు. దీని వల్ల చాలాప్రమాదం. అవి వారి గొంతులో కూడా ఇరుక్కుంటాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అందుకే పిల్లలని ఓ కంట కనిపెడుతూ ఉండాలి వారు ఎక్కడ ఉన్నా.
తాజాగా కర్ణాటకకు చెందిన ఓ బాలుడి వయసు మూడు సంవత్సరాలు. 5 సెంటీమీటర్ల పొడవైన గణేషుడి విగ్రహాన్ని మింగేశాడు. అది అన్నవాహికకు అడ్డంగా చిక్కుకుపోయింది. వెంటనే ఆ బాలుడి ఛాతిలో తీవ్రమైన నొప్పి కలిగింది. చివరకు ఛాతి, గొంతు ఎక్స్-రే తీయగా.. గణేషుడి విగ్రహం కనిపించింది.
వైద్యులు ఎండోస్కోపిక్ విధానంతో అన్నవాహికలో ఇరుక్కుపోయిన విగ్రహాన్ని తొలగించారు. దానికి బయటకు తీయడానికి దాదాపు గంటపాటు శ్రమించారు వైద్యులు. ప్రస్తుతం ఆ పిల్లాడు బాగానే ఉన్నాడు. అందుకే తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న వస్తువులు వారికి అందేలా ఉంచద్దు అని చెబుతున్నారు వైద్యులు.