50 వేల లీటర్ల మానవ మూత్రం కలెక్ట్ చేసిన బీర్ కంపెనీ – దానితో ఏం చేశారో తెలిస్తే షాక్

0
33

మద్యం తాగేవారు చాలామంది ఫస్ట్ బీర్ కి ప్రయారిటీ ఇస్తారు. ఇది తాగి యూత్ మరింత చిల్ అవుతారు. ఇక అమ్మాయిలు కూడా చాలా మంది బీర్ తమ ఫేవరేట్ అని చెబుతారు.పిస్నర్ కంపెనీ ఓ కోత్త ఆలోచన చేసింది. పిస్నర్ పేరులోనే పిస్ ఉంది. అంటే మూత్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు కొన్ని సంవత్సరాల క్రితం 50,000 లీటర్ల మానవ మూత్రాన్ని సేకరించారు.

మరి దానితో ఏం చేస్తున్నారు అంటే, బీరు తయారు అయ్యే బార్లీ పంటకు ఈ కంపెనీ వారు యూరిన్ ద్వారా తయారు చేసిన ఎరువును వినియోగిస్తారట. ఈ విషయం కంపెనీ తెలిపింది.

ఈ ప్రాజెక్టును బీర్సైక్లింగ్ అని పిలుస్తున్నారు. డానిష్ వారు చేస్తున్న ఈపనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇదో సరికొత్త ఆలోచన అంటున్నారు. డానిష్ రైతులు ప్రపంచంలో ఉత్తమ రైతులు. మానవుల మూత్రాన్ని ఎరువుగా వాడి పంటలు పండిస్తున్నారంటే, వారి తెలివి మామూలిది కాదు అంటున్నారు శాస్త్రవేత్తలు. మొత్తానికి చాలా మంది ఈ ఆలోచన విని సరికొత్తగా ఉంది అంటున్నారు.