శృంగారం అనుభూతిని అనుభవించాల్సిందే గానీ.. చెప్తే అర్థం అయ్యేది కాదు. దంపతుల మధ్య దాంపత్య జీవితం పటిష్టంగా ఉండటానికి ఇద్దరి మధ్య నమ్మకం, అవగాహనతో పాటు ఆరోగ్యకరమైన శృంగారం కూడా ఓ కారణం. కానీ అతి అనేది ఎప్పుడూ చెడ్డదే. ఆ నియమం సెక్స్‌కు కూడా వర్తిస్తుంది. కొంతమంది ఎప్పుడూ సెక్స్ కోరికలతో పరితపించిపోతుంటారు. ఎల్లవేళలా శృంగారం గురించే ఆలోచిస్తూ ఉంటారు. దీంతో వారి చుట్టూ ఎవరు ఉన్నా.. శృంగార దృష్టితోనే చూడటం, తప్పుగా ఊహించుకోవటం జరుగుతుంది. దీని వల్ల ఏ పని మీదా దృష్టిని కేంద్రీకరించలేరు. జీవితంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కోరికలను అదుపులో లేకపోవటంతో వ్యభిచారి కూపాల వైపు అడుగులు వేయటం, అశ్లీల చిత్రాలను అతిగా చూడటం, హస్త ప్రయోగం చేసుకోవటం, లేదా సెక్సువల్ ఫాంటసీ, సెక్స్ టాయ్స్‌ను ఉపయోగించటం చేస్తుంటారు.
సెక్స్‌కు అడిక్ట్ అయిన వాళ్లు ఇతర పనులపై దృష్టి సారించలేరు. అభిరుచులు, ఆలోచనలు శృంగారం చుట్టూ తిరుగుతూ ఉండటంతో.. స్నేహితులు, బంధుమిత్రులతో సంబంధాలు దెబ్బతింటాయి. హస్తప్రయోగం లైంగిక కోరికలను వ్యక్తీకరించటానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం.. కానీ, అధిక హస్త ప్రయోగం చేయటం లైంగిక వ్యసనానికి సంకేతం. అనుకూలించని సమయాల్లో కూడా హస్త ప్రయోగం చేస్తే.. శారీరక అసౌకర్యం లేదా నొప్పిని కలిగించే స్థాయికి హస్త ప్రయోగం చేరుతుంది. రెండు, మూడు నిమిషాల సుఖం కోసం సెక్స్ టాయ్స్ వంటివి వాడటం వలన దీర్ఘకాలికంగా దుష్ప్రభావాలు చూపుతాయి. కొన్ని సందర్భాల్లో లైంగిక వ్యసనం ప్రమాదకర సంబంధాలు పెట్టుకునేందుకు దారి తీస్తుంది. పబ్లిక్ సెక్స్, రక్షణ లేని సెక్స్ మరియు వేశ్యలతో సెక్స్ చేసేందుకు వెనుకాడరు. దీనివల్ల లైంగికంగా సంక్రమించే కొన్ని ప్రాణాంతక రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.
శృంగారం కోసం పరితపించే వాళ్లు దారి తప్పితే.. అత్యాచారం చేయటం, పిల్లలను సైతం వేధింపులకు గురిచేయటం వంటి వాటికి పాల్పడుతుంటారు. సెక్స్‌కు బానిసైన వారు కూడా తిరిగి సామాన్య జీవితం గడపవచ్చు. కాకపోతే కొంత సమయం పడుతుంది. సైకాలజిస్టులతో, నిపుణులతో చికిత్స చేయటం, ఆధ్యాత్మిక చింతన కోసం ఇష్ట దైవాన్ని పూజించటం వంటి ద్వారా సెక్స్ ఆలోచనలు దూరం పెట్టవచ్చు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపటం, పుస్తకాలను చదవటం, పేయింటింగ్ వేయటం వంటి ద్వారా శృంగార ఆలోచనలు రానివ్వకుండా చేయవచ్చు.