హారతిచ్చి జొమాటో డెలివరీ బాయ్‌కు స్వాగతం!

-

పండుగ జోష్‌లో అందరూ ఉన్నారు.. బయట జోరున వర్షం.. వాతావరణం చల్లగా ఉంది.. ఇంటిలో వండే మూడ్‌ లేకపోవటంతో, ఫుడ్‌ను జొమాటోలో ఆర్డర్‌ పెట్టారు.. కానీ ఆర్డర్‌ గంట ఆలస్యంగా వచ్చింది. పది నిమిషాలు ఆలస్యం అయితేనే.. సాధారణంగా కస్టమర్లు చిందులు తొక్కేస్తా ఉంటారు. అటువంటిది గంట లేట్‌ అయితే..!? ఇంకేమన్నా ఉందా.. డెలవరీ బాయ్‌తో మినీ యుద్ధమే చేసి ఉంటారు అనుకున్నారు కదా..? అలా అనుకుంటే మీరు జొమాటో యాప్‌లో కాలు వేసినట్లే..! అంత వర్షంలోనూ, ఫుల్‌ ట్రాఫిక్‌ను దాటుకొని పండగ వేళ ఆర్డర్‌ తెచ్చిన ఆ డెలవరీ బాయ్‌కు కస్టమర్‌ వినూత్నంగా స్వాగతం పలికారు. డెలవరీ బాయ్‌కు బొట్టుపెట్టి, హారతి ఇచ్చి సదరు కస్టమర్‌ స్వాగతం పలకటంతో, డెలవరీ బాయ్‌ ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుండగా.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. డెలవరీ బాయ్స్‌ కూడా సాధారణ మనుషులే అని గుర్తించిన వాళ్లే ఇలా చేస్తారంటూ కామెంట్‌ బాక్సును నింపేస్తున్నారు.

- Advertisement -

https://www.instagram.com/reel/CjVf8SUjRvq/?igshid=MDJmNzVkMjY%3D

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...