ఇటీవల కాలంలో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. చాలా మంది యాప్స్ ద్వారా ఈ పేమెంట్ చేస్తున్నారు. టీ షాపు నుంచి గోల్డ్ షాపు వరకూ అందరూ ఇదే పేమెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్ యాప్స్ రోజు లక్షల ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. కచ్చితంగా కస్టమర్లు వీటికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
యూపీఐ పేమెంట్స్ కు లిమిట్ అనేది ఉంటుంది. గూగుల్ పేకు లిమిట్ ఎంత, నిబంధనలు ఏమిటి అనేది చూద్దాం. ఒక బ్యాంకు అకౌంట్ నుంచి మొత్తం రోజుకు రూ.లక్ష వరకే డబ్బు పంపించే అవకాశం ఉంటుంది. అది గూగుల్ పే అయినా మరే ఇతర యాప్ అయినా. ఇక దానికి మించి మీరు ట్రాన్స్ ఫర్ చేయాలి అంటే అది సక్సస్ అవ్వదు. యూపీఐ యాప్స్ లో రోజుకు 10సార్లే డబ్బు సెండ్ చేసే అవకాశం ఉంటుంది.
కొన్ని బ్యాంకుల ఖాతాలకు రూ.లక్ష పరిమితి ఉంటే మరికొన్నింటికి తక్కువగా ఉంటాయి. ఎస్ బీ ఐ ఖాతాదారులు రోజుకి లక్ష వరకూ యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు. కచ్చితంగా మీరు మీ బ్యాంకును సంప్రదించి లిమిట్ను కనుక్కుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఏదైనా సమస్య వస్తే తమ సపోర్ట్ను సంప్రదించాలని గూగుల్ పే సూచించింది. ఇలా ఫెయిల్ అవుతున్నప్పుడు వేరే బ్యాంకు ఖాతా లింక్ అయి ఉంటే, దాని నుంచి డబ్బు పంపి ప్రయత్నించాలని చెప్పింది. ఏదైనా సర్వర్ లోపాలు ఉంటే ఇలా జరుగుతుంది అని తెలిపింది. రూపాయి నుంచి ఎంతైనా పేమెంట్ చేసుకోవచ్చు.