పోలీసులను చూస్తే నేరగాళ్ల లాగులు తడుస్తాయి. సాధారణ కానిస్టేబుల్ ఎస్సై లను చూసినా నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ సైబర్ నేరగాళ్లు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ ట్విట్టర్ అకౌంట్ నే హ్యాక్ చేసి గట్టి షాక్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు నకిలీ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. అంతేకాదు డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రొఫైల్ ఫొటో పెట్టి పలు ట్వీట్లు కూడా చేశారు.
పెద్ద బాస్ ట్విట్టర్ ఖాతా అనుకుని జిల్లా ఎస్పీలు ఆ ఖాతాను ఫాలో అవడం మొదలుపెట్టారు. పెద్దాయన పేరు మీద ఉన్న ఈ ట్విట్టర్ ఖాతా నకిలీది అని డిజిపి కార్యాలయ అధికారులు గుర్తించారు.
బెజవాడ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి విచారణ ఆరంభించారు.
ఈ సైబర్ కేటుగాళ్లు మామూలుగా లేరుగా… ఏకంగా పోలీస్ బాస్ పేరుతోనే నకిలీ ఖాతా తెవరడం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దీన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.