ఇప్పుడు చాలా మంది కొత్త కార్లు తీసుకుంటున్నారు. కచ్చితంగా ఓ విషయం అయితే కారు కొనే వారు తెలుసుకోవాలి .అంతేకాదు ఇప్పటికే కారు ఉన్న వారు కూడా ఈ విషయం తెలుసుకోవాలి.
మీరు తప్పకుండా ఎయిర్ బ్యాగ్ కారులో అమర్చుకోవాల్సిందే. కొత్త కారు కొంటే కచ్చితంగా చాలా కంపెనీలు ఎయిర్ బాగ్స్ ఇస్తున్నాయి. అయితే ఇప్పటికే కార్లు కొన్న వారు, అందులో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే కచ్చితంగా వాటికి కూడా ఎయిర్ బ్యాగ్స్ పెట్టుకోవాల్సిందే.
ఇప్పటి వరకు డ్రైవర్ సీటుకు మాత్రమే ఏర్పాటు ఉన్న ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ పక్కనే ఉన్న మరో సీటుకు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని రహదారి రవాణా శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కొత్తగా తయారు అవుతున్న అన్నీ మోడల్స్ కార్లకి కూడా ఇది అమలు చేస్తారు.
2021 ఏప్రిల్ 01 తర్వాత తయారు చేసిన వాహనాలు కొత్త మోడళ్లు విషయంలో ఫ్రంట్ సీట్ ఎయిర్ బ్యాగ్ అమర్చాల్సి ఉంటుంది. ఇది ప్రయాణికుల భద్రత కోసం తీసుకున్న నిర్ణయం. ఇక ప్రతీ కారుకి కచ్చితంగా ఎయిర్ బ్యాగ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం డిసెంబర్ వరకూ ఈ సమయం పొడిగిస్తారు అని అంటున్నారు.