1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉండేదో తెలుసా?

0
113

అమెరికా సైన్యం ఇలా ఆఫ్ఘనిస్తాన్ వీడిందో లేదో ఇక్కడ తాలిబన్లు రెచ్చిపోయారు. ఆ దేశాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. అప్పటి వరకూ అసలు ఎక్కడ ఉన్నారో కూడా బలగాలకు తెలియకుండా జాగ్రత్తగా ఉన్న ఆ తాలిబన్ల గ్రూపులు నెమ్మది నెమ్మదిగా అన్నీ నగరాలను కైవసం చేసుకున్నాయి. ఆ దేశాధ్యక్షుడు దేశాన్ని తాలిబన్లకు అప్పగించి, తను మాత్రం కుటుంబంతో సహా పారిపోయారు.

తాలిబన్ల చేతిలోకి దేశం రావడంతో చాలా మంది ప్రజలు ఆఫ్ఘాన్ సరిహద్దులు దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ ఇలాంటి దేశాలు ఇలా వలస వస్తున్న శరణార్దులకి షెల్టర్ ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న జనానికి ఒకటే భయం. మళ్ళీ 1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల పాలన సమయంలో విధించిన చట్టాలు అమలు చేస్తారా అని భయపడుతున్నారు.

ఈ పరిపాలన సమయంలో షరియా చట్టం అమలు చేశారు. తప్పు చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపడం, కొరడాలతో అందరి కళ్లముందూ హింసించండం ఇలాంటివి చేశారు. అమ్మాయిలని బలవంతంగా వివాహం చేసుకోవడం ప్రశ్నిస్తే చంపడం. ఎడారుల్లో వదిలేయడం ఇవన్నీ చేసేవారు అయితే ఇలా వీరు మళ్లీ రెచ్చిపోతే తమ పరిస్దితి ఏమిటి అని భయపడుతున్నారు.