లక్ష్మీదేవి మీ ఇంట ఉండాలంటే ఇవి పాటించండి

Follow these if Lakshmi Devi is to be your home

0
144

చాలా మందికి ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. జీవితంలో ముందుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారం చేసినా ఉద్యోగాలు చేసినా వాటిలో రాణింపు గుర్తింపు చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఆర్దికంగా చేతికి వచ్చిన నగదు కూడా అనుకోని కారణాలతో చాలా వరకూ నష్టపోతూ ఉంటారు.అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం ,ఆశీర్వాదం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు.

మన ఆర్దిక సమస్యలు తీర్చి,అష్టైశ్వర్యాలను ఇచ్చేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. సకల సంపదలకు అధినేత ఆ తల్లి అందుకే ఆమె అనుగ్రహం కోసం చూస్తారు. మరి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే ఆ ఇంట సంపద ఉంటుంది. లక్ష్మీదేవి నివాస స్థానాలు పాలు, పూలు ,పసుపు ,కుంకుమ, దీపం,గోవు ,ధనం, ధాన్యం, పరిశుభ్రమైన ఇల్లు. ఇక్కడ ఎప్పుడూ ఆమె ఉంటారు.

భక్తి శ్రద్దలతో కొన్ని నియమాలతో ఉంటే కచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదయం కచ్చితంగా ఇంట్లో అందరూ లేవాలి. బద్దకం అనేది ఉండకూడదు.కష్టపడకుండా సోమరితనంతో ఉండేవారి వైపు అస్సలు ఆమె చూడదు. వివాదాలు కలహాలు ఉండేవారి ఇంట అస్సలు రాదు.