పూజగదిలో ఈ దేవుడి పటాలు, విగ్రహాలు పెడుతున్నారా?

0
96

పూజ గదిలో ప్రతీ ఒక్కరు అన్ని రకాల దేవుళ్ల ఫోటోలు పటాలు పెట్టి పూజిస్తారు. ఇక ఇంటి దైవంగా కొలిచే దేవుడి విగ్రహాలు ఉంటాయి. సీతారాములు, పార్వతీ పరశమేశ్వరులు, లక్ష్మీ నారాయణల దంపతుల ఫోటోలు పూజ గదిలో పెట్టి పూజలు చేస్తే ఆ కుటుంబాలకు ఆనందం. అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి ప్రతిమలను గూటిలో పెట్టుకుంటే మంచిది. మీరు మూడు వినాయక విగ్రహాలు, రెండు శివలింగాలను పెట్టి పూజించినా మంచిదట. పూజ గదిలో పితృదేవతల ఫోటోలు అంటే తాత ముత్తాతల ఫోటోలు పెట్టకూడదు. అంతేకాదు పూజగదిలో మరణించిన వారి ఫోటోలను పెట్టకుండా వుండటం మంచిది.

గణపతి దేవుని విగ్రహన్ని ముందు పెట్టి పూజించాలి. ఇక వాడిపోయిన పూలను అస్సలు ఉంచకూడదు. ఇక నిన్నటి పూలను మాలలు దండలు కట్టి ఏరోజూ దేవుడికి వేయకూడదు. ఇక పూజ గదిలో పూజించి మీరు సింహాసనం బీరువాలో పెట్టుకుంటే ఆర్దికంగా చాలా మంచిది.