వివాహం చేసుకునే వారికి గుడ్ న్యూస్ – మ్యారేజ్ గిఫ్ట్ ఇలా పొందండి

Good news for those who are getting married

0
112

ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పెళ్లి రెండు మనసులని ఒకటి చేస్తుంది. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కలుపుతుంది. కొత్త జీవితానికి తొలి అడుగు వేస్తారు. అందుకే పెళ్లి సమయంలో ఎంతో సందడి ఉంటుంది. పెళ్లి సమయంలో దేవుళ్లను పూజించడం మన సంప్రదాయం. తొలిగా వినాయకుడిని పూజిస్తాం. పెళ్లి సమయంలో శుభలేఖను ముందుగా దేవుడి గదిలో పెట్టి ఆ తర్వాత తమ బంధువులకు, స్నేహితులకు అందజేస్తుంటారు.

మన తెలుగు స్టేట్స్ తో పాటు దేశంలో చాలా మంది తమ మొదటి శుభలేఖను తిరుమల శ్రీవారికి అందించడం చేస్తారు. తిరుమల శ్రీవారికి ఈ శుభలేఖ పంపాలి అని కొందరు దూరంగా ఉన్న వారు భావిస్తారు. అయితే ఎలా పంపాలి అనేది వారికి డౌట్ ఉంటుంది. మీరు మొదటిగా శుభలేఖను ఒక నెల ముందుగానే తిరుమలకు పంపించవచ్చు.

వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. అందులో చేతి కంకణాలు, అక్షింతలు ఉంటాయి. ఇవి పెళ్లి తలంబ్రాలో కలుపుకోవచ్చు వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు. ఇలా ఈ పెళ్లి కానుక అందడం వల్ల ఆ కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉంటారు. మీరు శుభలేఖని శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు కొరియర్ చేయాలి. .