నవ గ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి

How many Circumambulation should be made for each of the nava grahas ?

0
137

మనం ఆలయాలకు వెళ్లిన సమయంలో అక్కడ నవగ్రహాల ఆలయాలు ఉంటాయి. వాటి చుట్టు భక్తులు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తూ ఉంటారు. తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో దాదాపు అన్ని ఆలయాల్లో నవగ్రహాలను ఏర్పాటు చేసున్నారు. ఈ రోజుల్లో నవగ్రహాలను పూజించే వారి సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా గ్రహ దోషాలు ఉంటే వెంటనే అక్కడ పూజలు చేసుకుంటున్నారు.

ఇక నవగ్రహాల చుట్టు దాదాపు 9 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు భక్తులు. అంతేకాదు ఆ విగ్రహలకు అభిషేకం చేస్తారు. అయితే ఒక్కో గ్రహానికి ఒక్కో విధంగా పూజలు ప్రదక్షిణాలు ఉంటాయి. మరి ఏ దేవుడికి ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణాలు అనేది పూజారులు ,పండితులు చెప్పేది తెలుసుకుందాం.

సూర్యునికి 10ప్రదక్షిణాలు

చంద్రుడికి 11 ప్రదక్షిణాలు

గురు గ్రహానికి 5 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి

శుక్ర గ్రహానికి 6 ప్రదక్షిణాలు చేస్తే మంచిది

అంగారకుడికి 12 ప్రదక్షిణాలు చేయాలి

రాహు గ్రహానికి 4 ప్రదక్షిణాలు చేయాలి

కేతు గ్రహానికి 9 ప్రదక్షిణాలు చేయాలి

శనిగ్రహం 9 నుంచి 11 ప్రదక్షిణాలు చేయవచ్చు

తైలాభిషేకం చేసిన తర్వాత ప్రదక్షిణ చేయాలి.