తెలంగాణలో భూముల డిజిటల్ సర్వేపై 17 కంపెనీల ఆసక్తి

land survey telangana land survey telangana land digital survey

0
110

రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే చేపట్టడానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో రూ.400 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియ ను ముందుకు తీసుకువెళ్లేందుకు మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో వివిధ కంపెనీలతో ప్రాథమిక స్థాయి సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి నిర్వహించారు.

భూముల డిజిటల్ సర్వే జరిపెందుకు ఆసక్తి వ్యక్తపరిచిన 17 కంపెనీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఇతర రాష్ట్రాలలో నిర్వహించిన భూముల డిజిటల్ సర్వే సందర్భంగా తాము ఎదురుకున్న సమస్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయా కంపెనీలు వివరించాయి.

భూముల డిజిటల్ సర్వే పై ఈ కంపెనీలతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. అలాగే భూముల డిజిటల్ సర్వేకు ఉపయోగించే పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, సర్వేకు పట్టే సమయం, అయ్యే వ్యయము, అందుబాటులో ఉన్న సర్వే పరికరాలు, సాంకేతిక నిపుణులు , కావాల్సిన సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ , ఇంటర్నెట్ సామర్ధ్యం తదితర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగం కమీషనర్ అండ్ ఐ.జి. శ్రీ శేషాద్రి, టి.ఎస్‌.టి.ఎస్. ఎండి శ్రీ వెంకటేశ్వర్ రావు, సర్వే, సెటిల్మెంట్ & ల్యాండ్ రికార్డ్సు కమీషనర్ శ్రీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.