మోహినీ అవతారంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి

0
159

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో అభయమిచ్చారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించారు.

సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించిన‌ప్పుడు అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి  అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంలో సాక్షాత్కరించారు. సమ్మోహనమైన ఆమె చూపులకు అసురులు పరవశులైపోయి ఉండగా , దేవతలకు అమృతం అనుగ్రహించ‌డం జరిగింది అని పురాణాలు చెబుతున్నాయి.

కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు  దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో  ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా రెడ్డి, కంకణభట్టార్‌ శ్రీసూర్యకుమార్‌ ఆచార్యులు ఇతర ఆధికారులు పాల్గొన్నారు.