మనుషులు చేసే పనుల వల్లే ప్రకృతి వైపరిత్యాలు వస్తున్నాయి అని అంటున్నారు నిపుణులు. చెట్లు నరికివేయడం, ఖనిజాలు వెలికి తీయడం, నదులు కలుషితం అవ్వడం, కాలుష్యం పెరగడం వీటన్నింటి వల్ల ఎన్నో వైపరిత్యాలు వస్తున్నాయి. ముఖ్యంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ధ్రువాల్లోని మంచు కరిగి సముద్రంలో కలిసిపోతోంది.
గ్రీన్ ల్యాండ్ లో ఈ ఒక్క వారంలోనే భారీగా మంచు కరిగిపోయింది. ఆ నీళ్లన్నీ ఫ్లోరిడా అంతటా పారితే 5 సెంటీమీటర్ల ఎత్తులో నిలుస్తాయట. అయితే ఉన్నట్లుంటి ఇలా ఎందుకు జరిగింది అనేది చూస్తే.
ఒక్కరోజే రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు నిర్ధారించారు. 22 గిగాటన్నుల అంటే 2,200 కోట్ల టన్నులు ఐస్ నీరుగా మారిందని తెలిపారు.
ఈ కరిగిన మంచునీరులో 1,200 కోట్ల టన్నుల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయని ఇక మిగిలినవి మళ్లీ మంచు అయ్యాయి అని తెలిపారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులే అందుకు కారణమవుతున్నాయని తెలిపారు సైంటిస్ట్ లు. అక్కడ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.