తేడా వస్తే జైలుకు పంపుతాం : ఆంధ్రా సిఎస్ కు సీరియస్ వార్నింగ్

0
100

ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్.జి.టి) సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తేడా వస్తే జైలుకు పంపుతామని హెచ్చరించింది. ఇంత ఘాటుగా ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పందించిందో అనుకుంటున్నారా… వివరాలు చదవండి.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎన్జీటి సీరియస్ అయింది. ఎన్జీటి ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఎన్జీటి ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఎన్జీటి ఛెన్నై ధర్మాసనం ఆంధ్రా సర్కారుపై సీరియస్ అయింది. ఎత్తిపోతల పథఖం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను జులై 12వ తేదీకి వాయిదా వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.