ఈ పందిం మాంసం ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్లో ఎక్కింది – ఏమిటా స్పెషాలిటీ

Pork in the Guinness Book of World Records

0
99

తమకు నచ్చిన ఆహారం కోసం కొంత మంది ఎంతదూరమైన వెళతారు. అంతేకాదు దాని కోసం ఎంత డబ్బులు అయినా ఖర్చు చేస్తారు. కొన్ని మనకు అందుబాటు ధరలో ఉంటాయి. మరికొన్ని మాత్రం బాగా ధనవంతులు మాత్రమే కొనుక్కోగలరు. ఇది కూడా అలాంటిదే అదే స్పెయిన్లోని పంది మాంసం.

ఇదేమిటి పందిం మాంసం చాలా దేశాల్లో ఉంటుంది కదా, మరి ఇక్కడ స్పెషాలిటి ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు . స్పెయిన్ లో చాలా మంది పందిం మాంసం ఇష్టంగా తింటారు. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం లక్షా 60 వేల టన్నుల పంది మాంసం తింటారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పంది మాంసం కూడా ఉంటుంది.

ఆ పంది ఒక లెగ్ ధర లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి హామ్ తయారు చేస్తారు. దాని రుచి, తయారీ ప్రక్రియ కారణంగా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని సూపర్ వంటకాలు రేటు భారీగా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ఒక స్పానిష్ వ్యక్తి ఈ ప్రత్యేక జాతికి చెందిన పంది లెగ్ని 3 లక్షల 28 వేలకు అమ్మాడు. ఏకంగా ఇది గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది.

ఈ పందులని ప్రత్యేకంగా అండలూసియా ప్రాంతాలలో పెంచుతారు. ఇవి నల్ల జాతి పందులు. ఈ పందులని ఏకంగా నాలుగు సంవత్సరాలు మేపుతారు. ఇలా ఐదు నుంచి ఏడు సంవత్సరాలు చీకటి గదిలో ఉంచి ఆ తర్వాత మార్కెట్లో అమ్ముతారు.