నేటి నుంచి లింగంపల్లి టు విజయవాడ ఇంటర్ సిటీ రైలు సేవలు

0
120

జూన్ 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు లింగపల్లి టు విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు బంద్ అయ్యాయి. ఈ రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వే గురువారం నుంచి పునరుద్ధరించింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇంటర్ సిటీ రైలు కూత మొదలైంది. ఎక్కువ మంది ఉద్యోగులు ప్రయాణించే ఈ రైలుకు ఉద్యోగస్తుల రైలు అన్న పేరు పడింది. హైదరాబాద్ లో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగం చేసుకునే వారికి  ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుందని ఉద్యోగులు చెప్పుకుంటారు. ఇక ఇంటర్ సిటీ సేవలు స్టార్ట్ కావడంతో దీనిపై ఆధారపడి ఉద్యోగాలు చేసే ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 02796 నెంబరుతో లింగంపల్లిలో ఉదయం 4.40 గంటలకు బయలుదేరి విజయవాడకు 10.30 గంటలకు చేరుతుంది. ఇదే రైలు 02796 నెంబరుతో విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి లింగంపల్లికి రాత్రి 11.20 గంటలకు చేరుతుంది.