తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఈ ఆరు రైళ్లు రద్దు చేసిన సౌత్ సెంట్ర‌ల్ రైల్వే

0
110

ఈ క‌రోనా స‌మ‌యంలో బ‌స్సు ప్ర‌యాణాలు, రైల్వే ప్ర‌యాణాలు చాలా మంది చేయ‌డం లేదు. అత్య‌వ‌స‌రం అయితేనే ప్ర‌యాణాలు చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌యాణికులు ఎక్కువ‌గా ఉండే రైళ్లు బ‌స్సులు కాద‌ని సొంతంగా రెంట్ కి కార్లు తీసుకుని ప్ర‌యాణాలు చేస్తున్న వారిని చూస్తున్నాం. ఇటీవ‌ల చాలా రైళ్లు మ‌ళ్లీ ప‌ట్టాలెక్కాయి. కాని కొన్ని రైళ్లు ప్ర‌యాణికులు లేక ఖాళీగా క‌నిపిస్తున్నాయి. బోగిలో న‌లుగురు ఐదుగురు మాత్ర‌మే కొన్ని రైళ్ల‌ల్లో ఉంటున్నారు. మ‌రికొన్ని రైళ్లు మాత్రం జ‌నంతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే రెండు వారాలపాటు రద్దు చేసింది.

ప్రయాణికుల నుంచి స్పందన లేక రైళ్లు బోసిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మ‌రి ప్ర‌యాణికులు గ‌మ‌నించండి ఏ రైళ్లు ర‌ద్దు అయ్యాయో.

విశాఖపట్టణం-కాచిగూడ, (08561) జులై 14వ తేదీ వరకు ర‌ద్దు అయింది.
కాచిగూడ-విశాఖపట్టణం (08562) రైలు జులై 2 నుంచి 15వ తేదీ వరకు ర‌ద్దు అయింది
విశాఖపట్టణం-కడప (07488) రైలు 14వ తేదీ వరకు ర‌ద్దు అయింది
కడప-విశాఖపట్టణం (07487) రైలు 15వ తేదీ వరకు
విశాఖపట్టణం-లింగంపల్లి (02831) రైలు 14వ తేదీ వరకు
లింగంపల్లి-విశాఖపట్టణం (02832) రైలు 15వ తేదీ వరకు రద్దు అయింది.