న్యాయం చేయండి : న్యాయ మంత్రికి న్యాయవాదుల మొర

0
104

న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి న్యాయవాదుల వినతి ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం త్వర‌లో భర్తీ చేయనున్న‌ అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టులకు ఇప్పుడున్న గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని హైకోర్టు న్యాయ‌వాదులు సంఘం ప్ర‌తినిదులు న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని కోరారు.

సోమ‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. టీఎస్పీయ‌స్సీ గ‌తంలో నిర్వ‌హించిన వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు అభ్య‌ర్థుల వయోపరిమితిని స‌డ‌లించింద‌ని… ఏపీపీల నియమాకానికి కూడా వ‌యో ప‌రిమితిని పెంచాల‌ని మంత్రికి వివ‌రించారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వారికి హామీనిచ్చారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన వారిలో తెలంగాణ హైకోర్టు అడ్వాకేట్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, టీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ ఇంచార్జీ సీ. క‌ళ్యాణ్ రావు, ఇత‌ర టీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ ప్ర‌తినిదులు లలితారెడ్డి, నల్లమోతు రాము, స‌దానంద‌, విశ్వేశ్వరరావు, తెలంగాణ హైకోర్టు అడ్వాకేట్ అసోసియేష‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీ ధ‌న‌లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్లు శ్రావ్య, రాజు, ర‌మేష్ బాబు, హ‌రీష్, భాస్క‌ర్ గౌడ్, చంద్రశేఖర్ రావు, అజయ్ కుమార్, శ్రావణ్, త‌దిత‌రులు ఉన్నారు.