Errabelli | ఛీ ఛీ.. పాడుగాను, ఆమె నాకు బిడ్డలాంటిది : మంత్రి ఎర్రబెల్లి

0
100
Errabelli

మహిళా అధికారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఒక ఊర్లో మహిళా అధికారితో అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తున్నది. ఆడ ఊపుతవు కానీ… ఈడ ఊపవేంది అంటూ.. ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్ చేసినట్లు ప్రచారంలో ఉంది.

అయితే ఈ విషయమై మంత్రి ఎర్రబెల్లి వివరణ ఇచ్చారు. ఆ మహిళా అధికారి తనకు బిడ్డ లాంటిదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని వర్గాలు సంచలనాల కోసం ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. వక్రీకరించే వార్తలు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తన సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో ఉద్యోగులు, అధికారులపై గౌరవం ఉందని ప్రకటించారు.

ఆ మహిళా అధికారి కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధం ఉందని చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలంలోని ఉప్పల్ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి సభలో ఆ మహిళా అధికారిని… బాగున్నావా బిడ్డా అని పలకరించానని తెలిపారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాకు విడుదల చేసిన ప్రకటన కింద ఉంది… చదవొచ్చు.

తెలంగాణ రాష్ట్రం ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ అమ‌లులో అధికారులు, ఉద్యోగుల పాత్ర కీల‌క‌మైంద‌ని, పాల‌నా యంత్రాంగంలో అధికారులు, ఉద్యోగుల ప్రాధాన్య‌త‌ను గుర్తించిన రాష్ట్ర ప్ర‌భుత్వం వారికి అండ‌గా నిలుస్తుంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. శుక్ర‌వారం ప‌ల్లెప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా వ‌రంగ‌ల్ అర్భ‌న్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప‌లు గ్రామాల్లో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌పై అధికారుల‌తో స‌మీక్షించ‌డం జ‌రిగింది. ఈ క్ర‌మంలో వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా క‌మ‌లాపురం మండ‌లం ఉప్ప‌ల్ గ్రామంలో జ‌రిగిన ప‌ల్లెప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ప‌ల్లె ప్ర‌గ‌తి గ్రామ స‌భ‌కు వెళ్ల‌గానే ఆ అధికారి కుటుంబంతో గత ఎన్నో యేళ్లుగా ఉన్న‌ స‌న్నిహిత సంబంధాల‌తో వెళ్ల‌గానే ఏం బిడ్డా(కూతురు) బాగున్నావా అంటూ ప‌ల‌కరించ‌డం జ‌రిగింది. అనంతరం గ్రామంలో పారిశుధ్ధ్య నిర్వ‌హ‌ణ‌లో ఉన్న లోపాలు, ప‌చ్చ‌ద‌నం పెంపొందించేందుకు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు ఏవిధంగా అమ‌లు చేస్తున్నారు అని క‌మ‌లాపురం ఆ మండ‌లాధికారిని అడుగుతూ తెలంగాణ ఉచ్చ‌ర‌ణ‌లో మీరు భాగా ప‌నిచేస్తున్నారు. ఇంకా అంద‌రిని ఉరికించి ప‌నిచేయించండి అంటూ ప్రొత్స‌హించ‌డం జ‌రిగింది. కానీ కొంద‌రు దాన్ని వ‌క్రీక‌రించి సోష‌ల్ మీడియాలో సంచనాల కోసం దుష్ప్ర‌చారం చేస్తున్నారు. ఇది వాంచ‌నీయం కాదు. ప్ర‌భుత్వం, ఉద్యోగుల మ‌ద్య వైశ‌మ్యాలు సృష్టించేందుకు కొన్ని శ‌క్తులు ప‌నిచేస్తున్నాయి. మేం అధికారులు, ఉద్యోగుల‌ను ప్రొత్స‌హించి, రాష్ట్ర అభివృద్దిని ప‌రుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నాం.

ప్ర‌జాస్వామ్యంగా ఎన్నికైన మాకు ఎల్ల‌ప్పుడు ఉద్యోగులు, అధికారులతో పాటు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, మ‌హిళా అధికారుల‌పై గౌరవం ఉంటుంది. ముఖ్యంగా నా సుధీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఉద్యోగులు, అధికారుల‌పై ఎన్న‌డూ దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. భ‌విష్య‌త్‌లో కూడా నేను ఉద్యోగుల‌ను, అధికారుల‌ను గౌర‌విస్తాను. ఎన్ని శ‌క్తులు కుట్రలు ప‌న్నినా.. అధికారులు, ఉద్యోగులను ప్రొత్స‌హించి సంక్షేమ‌, అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను నిరాటంకంగా అమ‌లు చేస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు.