ప్రఖ్యాత రామప్ప దేవాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్

0
118

యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశం నుంచి వెళ్లిన రెండు ప్రతిపాదనల్లో ఒకటి తెలంగాణకు చెందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయం ఉండడం ఈ నెల 16 నుంచి 30 వ తేదీ వరకు యునెస్కో కట్టడాల గుర్తింపు సమావేశాలు ప్యారిస్ లో జరగనున్న నేపథ్యంలో నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ దేవాలయాన్ని సందర్శించి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామప్ప కళా నైపుణ్యాన్ని అధికారులు మంత్రికి వివరించారు. ఆ తరవాత దేవాలయ ప్రాంగణ పరిధిలో హరిత హారంలో భాగంగా మొక్కలు నాటి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్…

ramappa temple

ఎంతో ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయం సందర్శించి, శివునికి ప్రత్యేక పూజలు చేసి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను.

ఈ రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అన్ని పచ్చగా, పరిశుభ్రంగా ఉండేలనేది సీఎం కేసిఆర్ గారి ఆలోచన. ఇందుకోసం రాష్ట్రంలోని 12,769, గ్రామాలకు నెలకు 369 కోట్ల రూపాయలు , 141 మున్సిపాలిటీలకి నెలకు 141 కోట్లు కి నిధులు ఇస్తున్నారు.

మురికికూపాలుగా ఉన్న మున్సిపాలిటీలు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో దిన,దిన అభివృద్ధి చెందుతున్నాయి.

రాష్ట్రం పచ్చగా ఉండాలని, పర్యావరణం బాగుండాలని హరిత హారంలో ఎప్పటికీ మొక్కలు నాటడానికి, వాటిని సంరక్షించడానికి స్థానిక సంస్థల బడ్జెట్ లో 10 శాతం నిధులు కేటాయిస్తున్నారు.

sathyavathi rathod at ramappa temple

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వరుసగా నిర్వహించడం వల్ల అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు బాగా తగ్గాయి.

ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు సమకూర్చి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

రాష్ట్రంలో ప్రతి దారిలో, ప్రతి ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంచే కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. దీనిని ప్రోత్సహించేందుకు మొదటి బహుమానం 10 లక్షల రూపాయలు, రెండో బహుమతి 5 లక్షల రూపాయలు ప్రకటించారు.

రామప్పకు దాని నిర్మాణంలో విశిష్ట స్థానం ఉంది. ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఈనాడు చేయలేని కళా నైపుణ్యం ఇక్కడ రామప్పలో ఉంది.

ramappa temple inside

పురాతత్వ శాఖ పరిధిలో ఇది ఉండడం వల్ల దీని సంరక్షణ జరుగుతుంది. అయితే దీని విశిష్టత తెలిపే విధంగా మ్యూజియం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.

రామప్ప చెరువును రిజర్వాయర్ గా మార్చిన తరవాత ఈ ప్రాంతంలో వ్యవసాయం పెరిగే అవకాశం ఉన్నది. ఇందుకోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడుతున్నారు.

ఇటీవల ఇక్కడ వరదలు వచ్చినప్పుడు రోడ్లు తెగిపోతే పునరుద్దరణకు 1.81 కోట్లు ఇచ్చాం. కల్వర్టులకు 50 లక్షల రూపాయలు ఇచ్చాం. బ్రిడ్జిలకు 36 లక్షల రూపాయలు ఇచ్చాం.

ఇక్కడ షెడ్స్ నిర్మాణం చేపట్టి అర్హులందరికీ ఇస్తాం.

రామప్ప కు ప్రపంచ గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది.
800 ఏళ్ల క్రితం కట్టినప్పుడు వారు నిర్మించిన కళా నైపుణ్యం చాలా గొప్పది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దీనికి ఆశగా ఎదురుచూస్తున్నాము.

ఇసుకను నింపి ఇక్కడే దొరికిన రాయితో దీనిని కట్టారు. దీనికి వాడిన ఇటుక నీటిలో తేలడం మరొక విశిష్టత.

ఇక్కడి నిర్మాణాల్లో వెంట్రుక వాసి రంధ్రాలు చేసి అద్భుత కళా నైపుణ్యం ప్రదర్శించారు.

శివుడు నెలకొన్న గర్భ గుడిలో వెంటిలేషన్ సదుపాయం లేకున్నా లోపల వెలుగు ఉండేలా దీనిని అద్భుతంగా నిర్మించారు.

800 ఏళ్లుగా ఇక్కడి రాయి రంగు కూడా మారకపోవడం మరొక విశిష్టత.

అందుకే ఇంత విశిష్టమైన రామప్పను ప్రపంచ స్థాయి సంపదగా గుర్తించాలని కోరుకుంటున్నాం.

దేశం తరపున యునెస్కోకు వెళ్ళిన రెండు ప్రతిపాదనల్లో మన రామప్ప ఉండడం మనకు గర్వ కారణము.

దీని విశిష్టత తెలిసే విధంగా కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు.

ramappa devalayam

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీకి వెళ్లి దీని గొప్పతనాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రికి, పురాతత్వ శాఖ అధికారులకు ఇటీవల నేను, మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సి వెళ్లినపుడు చెప్పాం.

ఈ నెల 16 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్యారిస్ లో యునెస్కో వారసత్వ కట్టడాల గుర్తింపు పై 24 దేశాలు సమావేశం అవుతున్నాయి. కాబట్టి అక్కడ మనకు గుర్తింపు వచ్చే విధంగా శివుడు వారికి ఆలోచన కల్పించాలని ఆ మహాదేవుణ్ణి కోరుకుంటున్నాను. తన శక్తిని ప్రదర్శించి దీనిని ప్రపంచ స్థాయి కట్టడంగా వచ్చేలా చేయాలని వేడుకుంటున్నాం.

ఇన్నేళ్ల గొప్ప కట్టడం రామప్పకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాం.

ఉమ్మడి వరంగల్ లో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలు అనేకం ఉన్నాయి. కాబట్టి దీనికి యునెస్కో గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నాం.

ఈ ప్రాంతాన్ని పర్త్యటక కేంద్రంగా చేసేందుకు మేము కృషి చేస్తున్నాం.

ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు జరిగే సమావేశాల్లో 22 వ తేదీన మన రామప్ప గురించి ప్రదర్శన ఉంది. ఇందులో మన వారు సఫలీకృతులవ్వాలని, దీనికి యునెస్కో గుర్తింపు రావాలని ఎదురు చూస్తున్నాం.

ఈ సమావేశంలో మంత్రితో పాటు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు ఎస్పీ సాయి చైతన్య, స్థానిక నేతలు అధికారులు పాల్గొన్నారు.