8వ తరగతి లోపు పిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ : ఇక ఆ కష్టాలు ఉండవు

0
97

ప్రయివేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల వేధింపులు నేడు నిత్యకృత్యమయ్యాయి. రకరకాల ఫీజుల పేరుతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను భయపెడతున్నాయి కార్పొరేట్ పాఠశాలలు. తమకు కానీ, తమ పిల్లలకు కానీ ప్రస్తుతం చుదువుతున్న పాఠశాల నచ్చకపోతే వేరే స్కూల్ కు మార్చుకోవాలంటే నరకయాతన తప్పదు. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టిసి) ఇవ్వాలంటే ఆయా స్కూల్ మేనేజ్ మెంట్లు చిత్ర విచిత్రమైన ఫీజులను కట్టిన తర్వాతే ఇస్తామంటూ కండీషన్లు పెడుతున్నాయి. దీంతో పిల్లలు, వారి పేరెంట్స్ అవస్థలు పడాల్సి వస్తున్నది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి చెక్ పెట్టింది తెలంగాణ సర్కారు.

తెలంగాణ రాష్ట్ంలో విద్యార్థులు ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు మారేందుకు 8వ తరగతి వరకు ఎలాంటి బదిలీ ధృవపత్రం (టిసి) సమర్పించాల్సిన అవసరం లేదని సర్కారు స్పష్టం చేసింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఈమేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. పిల్లలు ఒక స్కూల్ నుంచి ఇంకో బడికి వెళ్లాలంటే ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాలు టిసి లు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు.

విద్యాహక్కు చట్టంలోనే టిసి సమర్పించాల్సిన అవసరం లేదనే విషయం స్పష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆయా జిల్లాల్లోని డిఇఓ లను సంప్రదించాలని ఆమె సూచించారు. కొత్త స్కూల్ లో జాయిన్ అయిన వారు ఆ పాఠశాలలో చైల్డ్ ఇన్ఫో డేటాలో పేరు నమోదయ్యేలా చూడాలని ఆమె తెలిపారు.

టిసి ఇవ్వకుండా సతాయించే కార్పొరేట్ కన్నింగ్ స్కూల్ మేనేజ్ మెంట్లకు ఇకనైనా ముుకుతాడు పడుతుందో లేదో చూడాలి.