రాగల మూడురోజులకు తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే

0
90

 

వర్షాకాలం ఆరంభమైంది. ఇప్పటికే తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో వివరిస్తూ వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం సంచాలకుల నుంచి ఒక ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాలు ఇవీ.

నిన్నటి ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి ఈ రోజు బలహీన పడింది. అల్పపీడనము ఈరోజు  దక్షిణ ఝార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలలో  కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య  ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు వ్యాపించి, ఎత్తుకు వెళ్లే కొలది  అల్పపీడనం నుండి నైరుతి దిశగా తెలంగాణా వైపుకి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

ఈ రోజు (14వ తేదీ) తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కురుస్తాయి. చాలా  ప్రదేశములలో మరియు రేపు, ఎల్లుండి (15,16వ.తేదీలు) కొన్ని ప్రదేశములలో వర్షాలు వచ్చే అవకాశములు ఉన్నాయి.

ఈ రోజు (14వ తేదీ) ఉరుములు , మెరుపులు  మరియు ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మి వేగంతో) కూడిన వర్షం తెలంగాణాలో కొన్ని జిల్లాలలో  ఒకటి ,రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి (15,16వ. తేదీలు) ఉరుములు మరియు  మెరుపులుతో కూడిన వర్షం   తెలంగాణాలో చాలా జిల్లాలలో  ఒకటి ,రెండు చోట్ల వచ్చే అవకాశములు ఉన్నాయి.

భారీ   వర్షములు ఈరోజు(14వ తేదీ) ఒకటి రెండు ప్రదేశములలో (ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ జిల్లాలలో)  ఒకటి రెండు  ప్రదేశములలో వచ్చే  అవకాశములు  ఉన్నాయి.