జాలరికి అరుదైన ముత్యపు శంఖం దొరికింది – దీని ధర ఎంత పలికిందంటే

The fisherman found a rare pearl cone - It's worth is

0
34

సముద్రంలో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకి ఇటీవల అనేక రకాల చేపలు పట్టుబడుతున్నాయి. అంతేకాదు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ధర కూడా పలుకుతున్నాయి. తాజాగా ఓ మత్స్యకారుడి వలలో భారీ శంఖం పడింది. తూర్పు గోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడికి లభించిన ఈ శంఖం బరువు దాదాపు మూడు కిలోలు వరకు ఉంటుంది.

ఉప్పాడ చేపల రేవుకు చెందిన జగన్నాథం అనే మత్స్యకారునికి ఈ భారీ శంఖం లభించింది. ఓ వ్యాపారి దీనిని రూ.18వేలకు దక్కించుకున్నాడు. శంఖంలో లక్షల విలువ చేసే ముత్యాలు ఉంటాయని భావించి జగదీశ్ అనే వ్యాపారి కొనేందుకు వచ్చాడు.
ఇటువంటి ముత్యపు శంఖం ఇప్పటి వరకు చూడలేదని మత్స్యకారులు దీనిని చూసేందుకు ఎగబడ్డారు. దీనికి చాలా నగదు వస్తుంది అని భావించారు.

ఇటీవలే కచ్చలి చేప చిక్కిన విషయం తెలిసిందే. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడి చివరకు అదే ప్రాంతానికి చెందిన వ్యాపారి రూ.2.40 లక్షలకు దక్కించుకున్నారు. మొత్తానికి ఇటీవల జాలర్లకు పంట పండుతోంది అంటున్నారు ఈ వార్త విన్నవారు.