పూర్వం ఫ్రెంచ్ రాజులు చేసే పని గురించి ఆ దేశ ప్రజలు అందరూ మాట్లాడుకునేవారు. ఎందుకంటే ఫ్రెంచ్ రాజులు ఎంత మంది భార్యలు ఉన్నా, వారు ప్రసవిస్తే అది ప్రజల అందరి ముందు చేసేవారు. అంటే ఆ రాణి గర్భిణిగా ఉన్న సమయంలో దేశంలో అందరికి తెలిసేది. ఇక ఆమెకి నొప్పులు వచ్చిన సమయంలో సభ దగ్గరకి ఆమెని తీసుకువచ్చి ప్రసవం జరిపేవారు.
ఇలా ప్రజలు అందరూ చూస్తు ఉండగా ఆ రాణి బిడ్డని కనేది. అయితే దీనిని వారు నామోషీగా భావించరు. ఎందుకు అంటే ఆ ఫ్రెంచ్ వారసుడు ఆమెకిపుట్టాడు అని అందరూ నమ్మడానికి ఇలా చేసేవారట. ఇది ఏనాటి నుంచి అలవాటుగా వచ్చింది నాడు రాజులు దీనిని పాటించేవారు.
ఇక అక్కడ అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా వారు ఎంతో ఆనందించేవారు. అంతేకాదు అక్కడ రాజులు ఎంతో ఆనందంగా పండుగ చేసేవారు. ఈ సమయంలో అక్కడ జనం అరుపులకి అక్కడ రాణి కూడా ఒక్కోసారి సృహ తప్పి పడిపోయేదట. ఇప్పుడు ఇలాంటి ఆచారాలు ఏమీ లేవులేండి.