వీడియో గేమ్ లు అంటే పిల్లలకే కాదు, కుర్రాళ్లకి కూడా చాలా ఇష్టం. కొందరు పెద్దలు కూడా ఈ గేమ్స్ పై చాలా ఇంట్రస్ట్ చూపిస్తారు. ఆ ప్లే జోన్ లోనే ఎక్కువ సేపు ఉంటారు. ప్రపంచంలో వీడియో గేమ్ లు, వాటిని ఆడే కన్సోల్స్ తయారీలో నింటెండో సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నింటెండో ఓ జపాన్ కంపెనీ. 1977లో ఈ సంస్థ నుంచి తొలి వీడియో గేమ్ విడుదల అయింది. ఆరోజు నుంచి ఈ కంపెనీ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
1990 వరకూ ఈ కంపెనీ అన్నీ దేశాల్లో తమ గేమింగ్ గాడ్జెట్స్ కొన్ని కోట్లలో అమ్మింది. ఈ సంస్థ 1996లో తయారుచేసిన ఓ వీడియో గేమ్ కన్సోల్ ను ఇటీవల వేలం వేశారు. సూపర్ మారియో-64 గేమింగ్ కన్సోల్ ను రూ.11.6 కోట్లకు సొంతం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఇది ఏకంగా వరల్డ్ రికార్డ్ అయింది.
అమెరికాలోని టెక్సాస్ హెరిటేజ్ సంస్థ ఈ వేలం నిర్వహించింది.
దీని గురించి గేమింగ్ మ్యాగ్ జైన్లు, ప్రపంచ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే అతని పేరుని మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. నింటెండో సంస్థ తయారుచేసిన సూపర్ మారియో-64 ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి.ఇక దానిని ఆ వ్యక్తి ఎవరో గుర్తుగా తీసుకుని ఉంటారు అని భావిస్తున్నారు అందరూ.