ఆరు నెలల చిన్నారిని జైలులో పెట్టాలని కుటుంబ సభ్యుల వినతి!

-

మీరు చదివింది నిజమే. ఓ ఆరు నెలల చిన్నారని ఆమె కుటుంబ సభ్యులే జైలులో పెట్టాలని ఎమ్మెల్యేల చుట్టూ, జైలు అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అంత చిన్నపిల్ల ఏం నేరం చేసిందని కుటుంబ సభ్యులు జైలులో పెట్టాలని ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నారా? అయితే పూర్తి కథనం చదవాల్సిందే!
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌ జిల్లాలోని రాజాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్థానికులు రామ్‌లీలాను చూస్తున్నారు. వారిలోని ఓ యువతి పట్ల ఇద్దరు పోలీసు అధికారులు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు ఆగ్రహంతో, సదరు అధికారులపై దాడికి దిగారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఏడుగురిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. అలా జైలుకు వెళ్లిన వారిలో ఈ ఆరు నెలల చిన్నారి తల్లి కూడా ఒకరు. తల్లి జైలుకు వెళ్లటంతో, తల్లిపాలు తప్ప, వేటినీ ఆహారంగా తీసుకోలేకపోతున్న చిన్నారి ఆకలి తట్టుకోలేక ఏడుస్తూనే ఉంటుంది. బయట దొరికే పాలును పట్టిస్తున్నా, ఆ చిన్నారి తీసుకోకపోవటంతో.. చిన్నారి ఆకలి తీర్చటం కుటుంబ సభ్యులు వల్ల కావటం లేదు. దీంతో చిన్నారిని తల్లితో పాటు జైలులో ఉంచాలంటూ కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యేను సంప్రదించినా, ఆయన ఒప్పుకోకపోవటంతో కుటుంబ సభ్యులకు ఏంచేయాలో అర్థం కావటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...