బ్రేకింగ్ – జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించిన ఆ స్టేట్

The state announced that it was extending the lockdown until July 1

0
107

కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా విజృంభించిందో చూశాం. చాలా స్టేట్స్ లో ఇంకా కేసులు తగ్గుముఖం పట్టలేదు. కేసులు భారీగా రావడంతో అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. ఇప్పుడు కేసులు తగ్గడంతో పలు సడలింపులు ఇస్తున్నాయి పలు రాష్ట్రాలు. అయితే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొన్ని రాష్ట్రాలు పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయకుండా ఆంక్షలు విధిస్తూ పలు రంగాలకు సడలింపులు ఇస్తున్నాయి. ఇలాంటి వేళ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

ఏప్రిల్ 22న ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కు సంబంధించి కఠిన నిబంధనలను ప్రారంభించింది. ఇలా ఇప్పటి వరకూ ఏడుసార్లు లాక్ డౌన్ పొడిగించారు.ఈసారి మొత్తం లాక్ డౌన్ తీస్తారు అని ప్రజలు అనుకున్నారు .కాని ధర్డ్ వేవ్ ముప్పు ఉంది. మళ్లీ అన్నీ రంగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు.అంతరాష్ట్ర బస్సు సర్వీసులను అనుమతించబోమని జార్ఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఎవరైనా రావాలి అంటే కచ్చితంగా ఈపాస్ ఉండాల్సిందే. ప్రార్థనా స్థలాలన్నీ మూసి ఉంచాలని ఆదేశించింది.