ఇక రైల్ టికెట్ బుక్ చేయాలంటే ఈ రెండు ఉండాల్సిందే

These two are required to book a train ticket

0
40

నిత్యం లక్షలాది మంది రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే కొందరు దళారులు కూడా ఇందులో ఎంటర్ అయి మోసాలకు పాల్పడుతున్నారు. ఇకపై వారికి చెక్ పెట్టనుంది రైల్వే శాఖ. రైల్వే టికెట్ బుకింగ్లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇక నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ లేదా, పాస్పోర్ట్, లేదా పాన్ లాంటి గుర్తింపు పత్రం ఉండాల్సిందేనని భారతీయ రైల్వే అంటోంది.

కొందరు ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు చేస్తున్నారు. దీనిని గుర్తించింది రైల్వేశాఖ, పండుగ రద్దీ సమయాల్లో రైలు టికెట్లను పెద్ద మొత్తంలో బుక్ చేసుకుని, వేరే వారికి ఇస్తున్నారు. దీని కోసం ఇతర సాఫ్ట్ వేర్ లని ఉపయోగిస్తున్నారు. ఇక వీరికి కళ్లెం వేయనుంది.

అందుకే వెబ్సైట్లోనూ భారీగా మార్పులు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక నుంచి యూజర్ నేమ్, పాస్వర్డ్ తో కాకుండా కేవలం ఆధార్ నంబర్ లేదా పాస్పోర్ట్ నంబర్తో లాగిన్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రతీ ఒక్కరికి ఒక అకౌంట్ మాత్రమే ఉంటుంది. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లే.