గోల్డ్ ఫిష్ లను పెంచుతున్నారా ఇది తప్పక తెలుసుకోండి

This is a must know if you are raising goldfish

0
108

ఈ గోల్డ్ ఫిష్ లను మనం చూస్తే చాలా చిన్నగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్వేరియంలలో పెంచుకుంటారు. అవి అంతకంటే ఎక్కువ పెరగలేవు. కాని అమెరికాలో ఫుట్బాల్ సైజులో పెరిగిన గోల్డ్ఫిష్లను చూసి అక్కడ అధికారులు జనం షాక్ అవుతున్నారు. ఇది చాలా ప్రమాదం అంటున్నారు. మరి ఎందుకో చూద్దాం.సాధారణంగా ఈ చేపలు 2 లేదా 3 అంగుళాల సైజు మాత్రమే పెరుగుతాయి. ఆ తర్వాత చనిపోతాయి.

కాని అమెరికా మిన్నెసొటాలో కెల్లార్ లేక్లో ఈ చేపలు భారీగా పెరగడం చూసి షాక్ అయ్యారు. గతంలో కొంత మంది ఈ చేపలను ఈ లేక్ లో వదిలారు. ఇక అక్కడ ఆహరం ఎక్కువగా దొరకడంతో ఈ చేపలు భారీగా పెరిగాయి. ఇకపై ఎవరూ కూడా నదులు, చెరువుల్లో గోల్డ్ఫిష్లను వదలొద్దు అని ఆర్డర్ పాస్ చేశారు అధికారులు. ఇలా ఇవి భారీగా పెరగడం వల్ల మిగిలిన చేపలు బ్రతకలేవు. ఆ నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి. నీటిలోపల ఉన్న సున్నపురాయిని పాడుచేస్తాయి. అలాగే మొక్కల వేర్లను తినేస్తాయి.

అందుకే వీటిని ఎక్వేరియంలో మాత్రమే పెంచుకోవాలి అని చెబుతున్నారు. నదుల్లో, చెరువుల్లో వదిలితే భారీగా ఆహారం తిని ఎక్కువ సైజులో పెరుగుతాయి. ఇప్పుడు కెల్లార్ సరస్సులో ఎక్కడ చూసినా గోల్డ్ ఫిష్లే కనిపిస్తున్నాయి. ఈ చేపలు చాలా వేగంగా గుడ్లు పెడతాయి, వీటి సంతానం కూడా భారీగా పెరుగుతోంది.