ఓ పక్క వరద నీరు అయినా పడవల్లో పెళ్లి ఊరేగింపు – వీడియో వైరల్

Wedding procession in boats on one side flood water- viral video

0
89

ఆ పెళ్లికి వరుణుడు అడ్డుపడాలని చూసినప్పటికీ పెళ్లి జరిగింది. అంతేకాదు వరద నీటిలోనే పెళ్లి ఊరేగింపు కూడా చేశారు. వర్షాలకు ఊరంతా వరదలు వచ్చాయి. అయినా వారి పెళ్లి వేడుకలో జరగాల్సినవన్నీ జరిపించారు. వైరల్ అవుతున్న వీడియోని చూసి అందరూ ఆ జంటకి విషెస్ చెబుతున్నారు. బీహార్లోని సమస్తిపూర్లోని గోబర్సిత్తా గ్రామంలో ఇది జరిగింది.

అక్కడ వివాహం ముహూర్తం పెట్టుకున్నారు, కాని భారీ వర్షాలకు వరదలు వచ్చాయి. అయినా వారి ఆచారం ప్రకారం పెళ్లి కూతురి ఇంటికి మగపెళ్లివారు ఊరేగింపుగా పడవల్లో వచ్చారు. అక్కడ పెళ్లి అయిన తర్వాత మళ్లీ అవే పడవల్లో పెళ్లి కొడుకు ఇంటికి వివాహ ఊరేగింపును కొనసాగించారు.

ఇక్కడ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాగ్మతి నది ఉప్పొంగడంతో ఆ గ్రామం నిండా మోకాళ్లలోతుకుపైగా నీళ్లు నిలిచాయి. అయితే వారు మాత్రం పెళ్లికి డేట్ ఫిక్స్ చేయడంతో ముందుకు అడుగువేశారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

మీరు ఈ వీడియో చూడండి.