కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి

0
101

కూరలో కరివేపాకు అనేమాట మనం వింటూ ఉంటాం. అది తేలిగ్గా అనేస్తాం కాని, కరివేపాకులో ఉన్న మంచి ఫలితాలు మరెందులోనూ ఉండవు. మంచి సువాసనతో పాటు ఆహారానికి మంచి టేస్ట్ ని ఇస్తుంది కరివేపాకు. అందుకే పోపుల్లో కరివేపాకు లేకపోతే ఆ టేస్ట్ మిస్ అవుతాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ కరివేపాకు.

మనం ఒకవేళ కరివేపాకు తినకపోతే, శరీరానికి కావాల్సిన పోషకాలను మనం దూరం చేసుకున్నట్లే.
కరివేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ డైజెంటరీ, జీర్ణ, కార్మినేటివ్ లక్షణాలున్నాయి. ఇక బరువు పెరగకుండా చేస్తుంది, నోటిలో బ్యాక్టిరీయా ఉన్నా హరిస్తుంది.

ఇందులో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, రోజూ నాలుగు ఐదు ఆకులు తిన్నా మెరుగైన కంటిచూపు ఉంటుంది. రక్తహీనత తగ్గించే లక్షణాలు దీనిలో ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు దంతాల ఆరోగ్యానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. ఇక దీనిని పొడిగా తీసుకున్నా, రసం, చారు, పప్పు పొపుల్లో ఇలా ఎలా తీసుకున్నా మంచిదే.