ఈ తాలిబన్లకు ఇంత ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది? వారి సంపద తెలిస్తే షాక్

0
106

అమెరికా బలగాలు ఆఫ్ఘన్ ను వదిలి వెళ్లిన కొద్ది రోజులకే అక్కడ తాలిబన్లు రెచ్చిపోయారు. రోజుల వ్యవధిలోనే దేశాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేయడంతో ఆయన భార్య, ఆర్మీ చీఫ్, దేశ భద్రతా సలహాదారులతో కలిసి దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ కు వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.

అగ్రరాజ్యం అమెరికా శిక్షణలో ఆరితేరారు ఆఫ్ఘన్ సేనలు. కానీ వారిని ఎదిరించి అక్కడ దేశాన్ని హస్తగతం చేసుకున్నారు తాలిబన్లు. అయితే 20 ఏళ్లుగా అసలు తాలిబన్లు ఇలా ఎలా ఉన్నారు? వారికి ఆదాయం ఎలా వచ్చింది ఇవన్నీ తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ సంస్థ ప్రపంచంలోని టాప్-10 ఉగ్రవాద సంస్థల్లో ఒకటి.

అత్యంత సంపన్నమైన ఉగ్రసంస్థల్లో ఐదో స్థానంలో ఉంది. ప్రపంచంలో రూ. 14,800 కోట్ల వార్షిక టర్నోవర్ తో ఐసిస్ మొదటి స్థానంలో ఉంటే.రూ. 2,900 కోట్ల టర్నోవర్ తో తాలిబన్ సంస్థ ఐదో స్థానంలో ఉంది. అంటే పెద్ద పెద్ద ఎమ్ ఎన్ సీ కంపెనీల టర్నోవర్ లా వీరి ఆదాయం ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంది 2016 లెక్కలట.

కాని 2020 లో లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు తాలిబన్ల వార్షిక బడ్జెట్ రూ. 11,829 కోట్లు. ఆఫ్ఘనిస్థాన్ వార్షిక బడ్జెట్ రూ. 40 వేల కోట్లు. అందులో సైన్యానికి చేసిన కేటాయింపులు రూ. 800 కోట్లు.

మైనింగ్ ద్వారా, విదేశీ విరాళాలు
మాదకద్రవ్యాలు, విదేశీ ఎగుమతులు
పన్నులు, రియల్ ఎస్టేట్ వీటి ద్వారా తాలిబన్లు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు.