ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్ లు ఉంటే ఏం చేయాలి – తప్పక తెలుసుకోండి

What to do if there is more than one PAN card

0
151

పాన్ కార్డ్ ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతా ఓపెన్ చేసిన సమయంలో ఈ పాన్ కార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక పాన్ ఆధార్ లింక్ కూడా చేస్తున్నారు. ఈ పాన్ కార్డ్ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పది అంకెల ప్రత్యేకమైన ఆల్ఫాన్యూమరిక్ నంబర్ను కేటాయిస్తుంది ఖాతాదారులకి. పాన్ హోల్డర్ చేసే అన్ని లావాదేవీలను గుర్తించడానికి పాన్కార్డు ఉపయోగపడుతుంది.

పన్ను చెల్లింపులు, టిడిఎస్ / టిసిఎస్ క్రెడిట్స్, ఆదాయ రాబడి, కరస్పాండెన్స్ మొదలైనవి ఉంటాయి. మీకు ఓ పాన్ నెంబర్ వస్తే మరో పాన్ నెంబర్ పొందలేరు. మీరు ఒకవేళ పాన్ కార్డ్ పొగొట్టుకున్నా అదే నెంబర్ తో మరో కార్డు తీసుకోవచ్చు. ఖాతాదారులు ఎవ్వరికి అయినా ఒకటి కంటే ఎక్కువ పాన్లను ఆదాయపు పన్ను శాఖ అనుమతించదు.

ఒకవేళ ఎవరైనా అలాచేస్తే ఆ వ్యక్తికి జరిమానా విధిస్తారు. ఒకటి కంటే ఎక్కువ పాన్కార్డులు కలిగి ఉంటే ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 272 బి కింద రూ .10,000 జరిమానా విధిస్తారు. పేర్లు మార్చుకుని ఇలా పాన్ కార్డులు పొందితే జరిమానా విధిస్తారు. అయితే మీ దగ్గర ఒకటి కంటే రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే వాటిని ఆదాయపు పన్నుశాఖకు అప్పగించాలి.