చైనా ఎందుకు ఇంతలా వరదలతో ఇబ్బంది పడుతోంది – కారణం ఇదే

0
47

డ్రాగన్ కంట్రీ భారీ వర్షాలు వరదలతో దారుణమైన పరిస్దితులు చూస్తోంది. ఎన్నడూ లేని ఈ వరదలు చూసి ప్రజలు షాక్ కి గురి అవుతున్నారు. పార్కింగ్ చేసిన వాహనాలు కార్లు ఇలా అన్నీ కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.
చెప్పాలంటే గడిచిన వెయ్యేళ్లలో చైనాలో ఇలాంటి వర్షాలు రాలేదని నిపుణులు చెబుతున్నారు.
చైనాలోని కొన్ని నగరాలు చిగురుటాకుల వణికిపోయాయి.

చైనాలో కురిసిన భారీ వర్షాలకు సెంట్రల్ హెనన్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైంది. బెంగ్ జూ నగరంలోని మెట్రో రైలు దాదాపు సగం నీటిలో మునిగింది. జెంగ్ జూ పట్టణంలో 1.24 కోట్ల మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇక్కడ ఏకంగా 3 రోజుల్లో 617.1 మి.మీ వర్షం కురిసింది. 8 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

చైనాలోని పలు డ్యామ్లకు ప్రమాదం పొంచి ఉందంటున్నారు నిపుణులు. చైనాలో ఇప్పటి వరకు 302 మంది మరణించినట్లు
చెబుతున్నారు. చైనాలో 25 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. అయితే ఇంతలా వరదలు ఎందుకు ముంచేశాయంటే వాతావరణంలో మార్పులు అంటున్నారు. అలాగే పెరుగుతున్న పట్టణీకరణ ఉష్ణోగ్రతలు అని చెబుతున్నారు.
బెంగ్ జూ నగరం ఇంతలా నష్టపోవడానికి కారణం ఈ నగరం ఎల్లో రివర్ ఒడ్డున ఉందని చెబుతున్నారు.