ఐటీ సెక్టార్ లో దాదాపు 90 శాతం కంపెనీలు శని ఆదివారాలు సెలవులు ఇస్తాయి. వారానికి ఐదు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. అయితే జపాన్ ప్రభుత్వం సంచలనాత్మక రీతిలో వారానికి నాలుగు రోజులే పనిదినాలు అంటూ కీలక సిఫారసులు చేసింది. ఈ నిర్ణయంతో అక్కడ ప్రజలు చాలా ఆనందంలో ఉన్నారు.
ఈ నిర్ణయానికి కారణం అక్కడ ప్రజలు కుటుంబానికి సమయం కేటాయించాలని . అలాగే ఉద్యోగానికి వ్యక్తుల మధ్య సమతుల్యత ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో జనాభా పెరుగుదల లేకపోవడం జపాన్ లో ఓ సమస్య. ఇక ఎక్కువ సేపు పనిచేయడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించడం లేదు. దీంతో జపాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇలా వారానికి నాలుగు రోజులు పనిరోజులు ఉంటే, కుటుంబానికి సమయం తగినంత లభిస్తుంది.ఇలా
ప్రైవేటు సంస్థలకు ప్రతిపాదనలు చేసింది. ప్రజలు హాయిగా తిరుగుతూ షాపింగ్ చేస్తే ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుందని జపాన్ ప్రభుత్వం ఆలోచన. మరి చూడాలి ప్రైవేట్ సంస్ధలు దీనిపై ఏమంటాయో.