Flash News : మరో ఆఫీసర్ ను సస్పెండ్ చేసిన యాదాద్రి కలెక్టర్

0
120

యాదాద్రి జిల్లా కలెక్టర్ గా విధుల్లో చేరిన నాటినుంచి జిల్లా పాలనాయంత్రాంగంపై పట్టు బిగించే పనిలో పడ్డారు పమేలా సత్పతి. ఆమె తొలి వేటు డిపిఆర్ఓ మీద వేశారు. సమాచార శాఖకు అటాచ్ చేశారు.

తాజాగా ఆలేరు మున్సిపల్ కమిషనర్ లావణ్యపై వేటు వేశారు. లావణను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ పమేలా సత్పతి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వారి పట్ల కలెక్టర్ సీరియస్ గా ఉండడంతో ఎవరు ఏ టైంలో ఊస్ట్ అవుతారోనన్న భయం కొందరు సిబ్బందిలో నెలకొంది.