ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ నెల 22న వైఎస్సార్ కడప జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ముత్తూట్ ఫైనాన్స్: ఇంటర్న్‌షిప్/ట్రైనీ అసోసియేట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ప్రొబేషనరీ ఆఫీసర్ తదితర విభాగాల్లో 30 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ తదితర విద్యార్హతతో పాటు 20-30 సంవత్సరాల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాతో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. ట్రైనీ అసోసియేట్‌గా ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల వేతనం ఉంటుంది.
బిగ్ బాస్కెట్: డెలివరీ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటులంది. ఎంపికైన వారు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.18 వేల వరకు వేతనంతో పాటు ఇన్సెంటివ్స్ చెల్లించనున్నారు.
పబ్లిషింగ్ హౌస్ (MGI Technologies): డేటా కలెక్షన్&అసోసియేట్ ఎడిటర్ విభాగాల్లో 20 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంఎస్సీ(BZC, BSC, MPC) అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500-రూ.14000 వేల వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే ఇతర వివరాలకు 9908808914 నంబర్‌కు సంప్రదించవచ్చు.
@AP_Skill has Conducting Mini Job Mela at District Employment Exchange, O-Block, Collectorate, @Kadapagoap
Registration Linkhttps://t.co/5Ies8JJ25m
Contact
ISD. Chaitanya – 9908808914
S. Raghunath – 9063623706
M. Narasimhulu – 6300125455
APSSDC Helpline – 9988853335 pic.twitter.com/EyeY9G1Cg5— AP Skill Development (@AP_Skill) August 17, 2023