నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్షా 40వేల జీతంతో ఉద్యోగాలు

-

పలు ఉద్యోగాల భర్తీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్(Bharat Dynamics Limited)నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 21న ప్రారంభమై సెప్టెంబర్ 20వ తేదీన ముగియనుంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని పూర్తి చేయనుంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500గా ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మాత్రం ఫీజు మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు 27 ఏళ్లు.. మరికొన్ని పోస్టులకు 28 ఏళ్లగా ప్రారంభ వయసును నిర్ణయించారు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

- Advertisement -

పార్ట్-1లో సంబంధిత సబ్జెక్ట్/టాపిక్‌పై 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు అడగనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000- రూ.1,40,000, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులకు రూ.30,000–రూ.1,20,000 నెలకు వేతనంగా చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు. ఇబ్రహీంపట్నం (రంగా రెడ్డి జిల్లా), కార్పొరేట్ ఆఫీస్ (గచ్చిబౌలి), కంచన్‌బాగ్ యూనిట్ (హైదరాబాద్), భానూర్ యూనిట్ (సంగారెడ్డి జిల్లా), విశాఖపట్నం యూనిట్‌ (ఏపీ), అమరావతి (మహారాష్ట్ర), లియాసిన్ ఆఫీస్ (న్యూ ఢిల్లీ) కార్యాలయాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు Bharat Dynamics Limited అధికారిక వెబ్‌సైట్ bdl-india.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Read Also: మంత్రి హరీష్ రావుని గద్దె దించుతా.. మైనంపల్లి సంచలన శపథం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...