రాత పరీక్ష లేకుండా జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు.. జీతం ఎంతంటే..?

-

Samgra Shiksha Abhiyan: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష అభియాన్ .. విజయవాడలోని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 37
పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్ – 13
డేటా ఎంట్రీ ఆపరేటర్లు – 10
ఆఫీస్ సబార్డినేట్ -14
అర్హత: జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు.. బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/డీసీఏ/ఇంజనీరింగ సర్టిఫికేట్/కంప్యూటర్‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు చదవటం, రాయడం తెలిసి ఉండాలి.
వయసు: నవంబర్ 30, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది)
వేతనం: నెలకు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు రూ. 23,500,
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 23,500
ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులకు రూ. 15,000 చెల్లిస్తారు.
ఎంపిక: జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆఫరేటర్ ఉద్యోగాలకు అకడమిక్ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
సబార్డినేట్ పోస్టులకు పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేది: జనవరి 31, 2023.
సర్టిఫికెట్ల పరిశీలన: ఫిబ్రవరి 6,7 /2023.
స్కిల్ టెస్ట్ తేది: ఫిబ్రవరి 11, 12/2023.
జాబితా వెల్లడి: ఫిబ్రవరి 13, 2023.
వెబ్‌సైట్: https://apssa.aptonline.in

- Advertisement -
Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TDP final List: టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న...

Manchu Manoj | “పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్”: మంచు మనోజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తాజాగా హీరో మంచు మనోజ్(Manchu...