Kaloji Health University:నేటి నుంచి ఎంబీబీఎస్ తొలి విడత ప్రవేశాలు జరగనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. తెలంగాణలోని వైద్య విద్య కోర్సు విద్యార్థులకు ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. కాగా, నేటి నుంచి తొలి విడత విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చునని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటింది. నేటి ఉదయం ఆరు గంటల నుంచి నవంబర్ 1న మధ్యాహ్నాం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన వారు మాత్రమే ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ (Kaloji Health University)అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం www.knrhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నట్లు తెలిపారు.
Read also: చర్చిలో మళ్లీ రగడ.. కుర్చీలతో కొట్టుకున్న ఇరువర్గాలు