Group 2 ఉద్యోగాలకు ఎంతమంది అప్లై చేశారో తెలుసా?

-

తెలంగాణలో Group-2 దరఖాస్తుల ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 16) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 783 పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 5,51,901 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీపడనున్నారు. ప్రస్తుతం Group 2 దరఖాస్తు గడువు ముగియడంతో పరీక్ష తేదీ ఖరారుపై టీఎస్‌పీఎస్సీ సమాలోచనలు చేస్తోంది. గ్రూప్‌ 2 ఉద్యోగ నోటిఫికేషన్‌లో రాతపరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. పరీక్ష తేదీలపై ఫిబ్రవరి చివరి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Priyanka Chopra | ‘ప్రియాంక’ను ఒంటరిగా వ్యాన్‌లోకి రమ్మన్న డైరెక్టర్

‘ప్రియాంక చోప్రా(Priyanka Chopra)’.. పరిచయం అక్కర్లేని నటి. బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్‌గా...

Manickam Tagore | ఈడీ పెంపుడు కుక్క… కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) నివాసంలో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్...