తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్: 581 పోస్టుల భ‌ర్తీకి TSPSC నోటిఫికేషన్ 

-

TSPSC Recruitment Notification for post of welfare officers: తెలంగాణలో మొట్టమొదటిసారి ప్రభుత్వ వసతి గృహాల్లోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఖాళీగా ఉన్న 581 పోస్టుల భ‌ర్తీకి TSPSC శుక్రవారం నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్, వార్డెన్‌, మ్యాట్ర‌న్ పోస్టుల‌తో పాటు మ‌హిళా సూప‌రింటెండెంట్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 6 నుంచి 27వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. టీఎస్‌పీఎస్సీ నోటిపికేషన్ లో పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలన్నీ పొందుపర్చారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో త్వరలోనే అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ వసతి గృహాల్లోని ఖాళీల వివరాలు :
హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1(ట్రైబ‌ల్ వెల్ఫేర్) -05
హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2(ట్రైబ‌ల్ వెల్ఫేర్) – 106
హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌) -70
హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్) – 228
హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140
వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05
మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02
లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ – 19

- Advertisement -

Read Also:

హ్యాపీ లైఫ్ కోసం ఈ 12 రూల్స్ పాటించాల్సిందే!!

పరగడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి..!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...