Dark Circles | డార్క్ సర్కిల్స్‌ను వీటితో తగ్గించుకోవచ్చు..

-

డార్క్ సర్కిల్స్(Dark Circles).. ప్రస్తుతం యువత అంతా ఎదుర్కొంటున్న సమస్య ఇది. వర్క్ స్ట్రెస్ వల్లో, లైఫ్ స్టైల్ వల్లో, హెవీ స్ట్రెస్ వల్లో, సరైన నిద్ర లేని కారణంగానో ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి మన ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కళ్ళ చుట్టూ నల్లగా మారిపోయి మనల్ని ఆత్మన్యూనతకు గురిచేస్తాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా ఇవి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. చర్మానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి వాటినే డార్క్ సర్కిల్స్ అంటారు. ఇవి సాధారణ చర్మం కన్నా ముదురు రంగులో కనిపిస్తుంటాయి. కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.. శరీరంలో జరిగే చిన్నచిన్న మార్పులు కూడా ఈ చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు వివరిస్తున్నారు.

- Advertisement -

శరీరంలో ఏర్పడే చెడు పరిస్థితులే వీటికి, ఫైన్ లైన్స్‌కు ప్రధాన కారణమవుతాయి. ఏడుపు, అలర్జీలు, అలసట, నిద్రలేమి, కళ్లను రుద్దడం, ఎక్కవసేపు ఎండలో ఉండటం వల్ల డార్కిల్స్ త్వరగా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అంతేకాకుండా శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కూడా ఇవి రావొచ్చని అంటున్నారు. వీటిని తగ్గించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచితే సరిపోతుందని, దాంతో పాటు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని త్వరగా తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

చర్మ సౌందర్యానికి హైడ్రేషన్‌గా ఉండటం చాలా ముఖ్యం. శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోవడం మన చర్మం పీహెచ్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. దీంతో నల్లటి వలయాలు, ఫైన్ లైన్స్ సమస్యను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. దీంతో పాటుగా కంటి చుట్టూ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్‌ను వాడటం ద్వారా కూడా డార్క్ సర్కిల్స్(Dark Circles), ఫైన్ లైన్స్‌(Fine Lines)ను తగ్గించడం సులభతరం అవుతుందని అంటున్నారు. ఇందుకోసం ఫేస్ మాయిశ్చరైజింగ్ ఫేస్ క్రీములు, మాస్క్‌లు, ప్యాచ్‌లు, సీరమ్‌లను కూడా వాడొచ్చని నిపుణులు చెప్తున్నారు.

అలొవెరా: కలబంద గుజ్జును కళ్ల కింద రాసి 20 నిమిషాలు ఉంచాలి. అది ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో మొఖం కడిగేసుకోవాలి. కలబంద గుజ్జు మన చర్మంలోని పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

నిమ్మరసం: ఒక చెంచా నిమ్మరసం తీసుకుని అందులో బాదం నూనెను కలిసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ నూనెను కళ్ల చుట్టూ రాసుకుని ఒక 10 నిమిషాల తర్వాత మొఖం కడిగేసుకోవాలి. ఇది నల్లటి వలయాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని గ్లోగా మారుస్తుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్‌ను కూడా పెంచుతుందని అంటున్నారు.

విటమిన్-ఈ: విటమిన్-ఈ క్యాప్సుల ఒకటి తీసుకుని అందులో మందును తీసుకోవాలి. అందులో కొబ్బరి నూనెను మిక్స్ చేసుకోవాలి. ఆ నూనెను కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఒక అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో మొఖాన్ని కడిగేసుకోవాలి. విటమిన్-ఈ మందు చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో బాగా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు.

Read Also: ముఖంపై ముడతలా.. ఇవి ట్రై చేయండి..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

AAP | ఢిల్లీ ఎలెక్షన్స్… ఆప్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అధికార...

MLC Kavitha | ‘అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా’.. మళ్ళీ యాక్టివ్ అయిన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దాదాపు 85 రోజుల తర్వాత ఎక్స్(ట్విట్టర్)...