Healthy Foods | సహజంగా ఆడవాళ్ళు ఇంట్లోని వారిపై చూపించే కేర్ తమపై తీసుకోరు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. తమ గురించి తాము ఏమాత్రం శ్రద్ధ తీసుకోరు. దీంతో వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా.. ముఖ వర్చస్సు తగ్గి, ముడతలు వచ్చి వయసు పైబడిన వారిలా కనిపిస్తూ ఉంటారు. అయితే, తమ కోసం తాము ప్రత్యేకంగా సమయం కేటాయించలేని స్త్రీలు.. తినే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవడం వలన ఆరోగ్యంతోపాటు చక్కని అందం సొంతం అవుతుందట. అసలు వయసు కంటే పది సంవత్సరాలు చిన్నవారిలా కనిపిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు ఆ ఆహార పదార్థాలు(Healthy Foods) ఏంటో తెలుసుకుందాం.
పాలు : స్త్రీలు పాలు తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలనే తాగాలి. పాలలో ఎముకలను బలంగా ఉండే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
పెరుగు: కొవ్వు తక్కువగా ఉండే పెరుగు స్త్రీలకు ఎంతో హితకరమైనది. ఈ రకమైన పెరుగును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడేవారికి పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. స్త్రీలకు వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను, అల్సర్ ను కూడా తగ్గిస్తుంది.
టమాటాలు: స్త్రీలకు టమాటాలు ఔష ధంతో సమానం. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాణాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇక టమాటాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి. టమాటాలను రోజూ తినడం వల్ల ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు. ఎందు కంటే ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
పోషకాల సోయా: పోషకాలు పుష్కలంగా ఉండే సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్స్, ఐరన్ వంటి పోషకా లకు కొదవే ఉండదు. ఇవి అతివలను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి.
బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్: రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని స్త్రీలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి12, విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ డ్రై ఫ్రూట్స్ తింటే బలంగా ఉంటారు.
Read Also:
1. డైట్ లో ఉన్నవారికి కొవ్వు లేని బెస్ట్ చిరుతిళ్ళు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat