Weight Loss Tips: నేషనల్ ఒబెసిటీ ఫౌండేషన్ ప్రకారం మహిళల్లో, చిన్నారుల్లో ఊబకాయం సమస్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు డాక్టర్లని ఆశ్రయించే వారి సంఖ్యా ఎక్కువవు. తోంది, అయితే ఇతరత్రా పద్ధతుల కన్నా, చక్కటి ఆహార నియమాలను పాటించడం వల్ల సులువుగా, బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అందుకు ఉపయోగపడే పదార్థాలే ఇవి.
అవిసె గింజలు: రోజూ చెంచా అవిసె గింజల్ని వచ్చే ళ్లూ, టిఫిన్లూ, పండ్ల రసాలూ, ఓట్స్, మజ్జిగ, దేనిలో నైనా సరే కలుపుకొని తాగితే మంచిది. సలాడ్లపైనా గింజల నూనె చల్లుకుంటే మంచిది. అవిసె గింజల్లో అధికంగా ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గర్భిణులు మాత్రం వీటికి దూరంగా ఉండటం తప్పనిసరి.
గ్రీన్ టీ: శరీరానికి ఎంతో మేలు చేసే యాంటీ ఆక్సిడెం ట్లు వీటిల్లో అధికం. అంతేకాకుండా, శరీర మెటబాలిజా న్ని ఉత్తేజం చేస్తూ కెలొరీలను కరిగించే పోషకాలను గ్రీన్ టీ కలిగి ఉందని పలు అధ్యయనాలు వెల్లడిం చాయి.
దాల్చినచెక్క: రక్తంలోని చక్కెర నిల్వల్ని సమన్వయం చేయడంలో దాల్చిన చెక్క పాత్ర కీలకం. శరీరంలో పేరుకొన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని పొడిగా చేసుకొని వేడి అన్నంలో కాస్త వేసుకొని తింటే సరి. ఇది జీర్ణవ్యవస్త్రనూ మెరుగు పరుస్తుంది.
మిరియాలు: జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడే పదార్థాల్లో మిరియాలు ఒకటి. ఇది శరీరంలో అనవసరంగా కొవ్వు చేరకుండా సాయపడుతుంది. సలాడ్లూ, కూరల్లో చిటికెడు చల్లుకొని తింటే రుచిగా ఉంటుంది.
పసుపు: యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా దీనికి శరీర మెటబాలిజమ్ రేటుని మెరుగుపరిచే శక్తి కూడా కలిగి మెటబాలిజమ్ రేటునీ మెరుగుపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను నిరోధిస్తుంది. ఫలితంగా అధికబరువు అదుపులో ఉంటుంది.