Hindu Rituals | మన పూర్వీకులు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం దాగి ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అందుకే అనాధిగా పూర్వీకులు ప్రవేశపెట్టిన అనేక నియమాలను మనం పాటిస్తూ వస్తున్నాం. వాటిలో ఒకటి తిన్న ప్లేట్ లో చేయి కడగకపోవడం ఒకటి. అయితే తిన్న కంచంలో చెయ్యి ఎందుకు కడగకూడదు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hindu Rituals:
మానసికం: తిన్న ప్లేట్ లో చెయ్యి కడగగానే మనకు అక్కడనుంచి లేవబుద్ధి అవదు.
భావన: తిన్న తరవాత లేచి రెండు అడుగులు వేస్తే తిన్నాము అనే అనుభూతి కలుగుతుంది.
శారీరకం: తిని అలా లేచి చెయ్యి కడుక్కుంటే కడుపులో తిన్న ఆహారం సర్దుకుంటుంది.
మానవత్వం: మనం చెయ్యి కడిగిన ఎంగిలి కంచం తీయడం కంచాలు తీసే వారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి.
సంఘ ధర్మం: మనం తిని చేయి కడుక్కుని అక్కడే కూర్చుంటే మన తరవాత తినే వాళ్ళకు స్థలం దొరకక ఇబ్బంది పడవచ్చు.