మనం తినే తీరు మన గురించి చెప్పేస్తుందా?

-

Eating Style | మన నడక, నడిచే తీరు, చూసే చూపు, మాట్లాడే మాట ఇవన్నీ మన వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. మన చేతి రాత కూడా మన గురించి మనకే తెలియని విషయాలను వివరిస్తుంది. అంతెందుకు ఒక వస్తువును లేదా వ్యక్తినో మనం చూసే తీరును బట్టి కూడా మనం ఎలా ఆలోచిస్తున్నామో చెప్పేయొచ్చు. అదే విధంగా మనం ఆహారం తినే విధానం కూడా మన గురించి ఎన్నో విషయాలను వెల్లడిస్తుందట. ఈ విషయం నేను చెప్తున్నది కాదు.. నిపుణులు చెప్తున్నది. మనం మన ప్లేట్‌లో ఆహారం అమర్చుకునే తీరు నుంచి మనం దేనితో తినడం ప్రారంభిస్తాం.. దేనితో ముగిస్తాం అన్న చిన్నచిన్న విషయాలు కూడా మనకు సంబంధించి ఎన్నో కీలక విషయాలను వివరిస్తాయంటున్నారు నిపుణులు. మరి ఆ పద్దతులు ఏంటో కొన్ని చూసేద్దామా..

- Advertisement -

ఆహారం ప్రతి బైట్‌ని మన భాషలో చెప్పాలంటే ప్రతి ముద్దనీ ఆస్వాదిస్తూ తింటే.. మనం.. మనం చేసే పనిని కూడా అదే విధంగా అలాగే నెమ్మదిగా చేస్తారని పక్కవారు భావిస్తారు. అదే విధంగా వేగంగా ఆహారాన్ని ముగించేసే వారి గురించి కూడా అదేలా భావిస్తారట. వేగంగా తినడం పూర్తి చేసే వారు.. కచ్ఛితంగా మల్టీటాస్కార్లు(ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ పనులు చేసేవారు) అని పక్కా చెప్పొచ్చట. వాళ్లు తమ పనిని కూడా చకచకా పూర్తి చేయడమే కాకుండా.. గడువుకన్నా ముందు ముగిస్తారని అంటున్నారు. కాకపోతే వీరు తమ పనిలో పడిపోయి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతారని చెప్తున్నారు నిపుణులు.

అలాగే.. ఆహారం పెట్టుకునే సమయంలో అన్నం మధ్యలోనే ఉండాలి, కూర రంగు మారకూడదు.. పలానా కూర అక్కడే పెట్టుకోవాలి.. ఇలా ప్రతీదీ పట్టించుకునేవారు ఇతర విషయాల్లో కూడా అంతే పర్టిక్యూలర్‌గా ఉంటారట. ప్రతి విషయాన్ని అంతే ప్రణాళికబద్దంగా చేయాలని అనుకోవడమే కాకుండా.. అన్నీ అనుకున్నట్లే సాగాలని భావిస్తారట. ఇలాంటి వారు తమ పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకుంటారు.

ఇక అది తినను, ఇది తినను.. దీని రంగు బాగలేదు.. అంటూ వంకలు పెట్టేవారు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరట. వీళ్లెప్పుడూ ఓటమి భయంతోనే ఉంటూ.. కొత్త విషయాలను ట్రై చేయడానికి సంకోచిస్తున్నారని చెప్తున్నారు. వీళ్లు తమ కంఫర్ట్‌జోన్ నుంచి బయటకు రానంత వరకు అక్కడే ఉండి.. విజయాన్ని ఆస్వాదించలేరని నిపుణులు వివరిస్తున్నారు.

ఇంకా కొందరు వయసు పెరిగినా చిన్న పిల్లల మాదిరిగా తినే ప్లేట్ చుట్టూ మెతుకులు, ఆహారం పడేలా తింటుంటారు. వారితో ఉంటే సమయమే తెలియకుండా గడిచిపోతుందని అంటున్నారు. వాళ్లు తాము చేసే పనిని, చుట్టుపక్కల వారందరినీ ప్రేమిస్తారట. కాకపోతే వీటిలో పడిపోయి వీరు డెడ్‌లైన్స్ వంటి ముఖ్యమైన వాటిని మర్చిపోతారట. తినే సమయంలో శబ్దం చేసే వారు కూడా ఇలానే ఉంటారు. కాకపోతే పక్కవారే వీరిని అంతగా ఇష్టపడరు.

ఇక కొత్తకొత్త డిషెస్‌ను ట్రై చేయాలని అనుకునే వారు జీవితం విసిరే సవాళ్లకు ఎదురెళ్లి నెగ్గడానికి ప్రయత్నిస్తారట. వీళ్ల మైండ్ సెట్ అంతా కూడా ఎప్పటికి రిస్క్‌లోనే మజా ఉంది అన్నట్లు ఉంటుందట. ఇదే విధంగా మనం తినే తీరు మన గురించి మనకే పెద్దగా తెలియని ఎన్నో విషయాలను వివరిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి వీటిలో మీరు ఆహారం తినే తీరు(Eating Style) ఉందో లేదో చూసుకోండి.

Read Also: నిద్రే నిద్ర వస్తుందా.. కారణాలు ఇవేనేమో..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...