‘జగన్ నీ పాపాలు పండాయి’.. అచ్చెన్నాయుడు ఫైర్

-

సెప్టెంబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేయాలంటూ వైసీపీకి వైఎస్ జగన్(YS Jagan) పిలుపునివ్వడంపై మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) ఘాటుగా స్పందించారు. శ్రీవారి లడ్డూ తయారీలో వైసీపీ చేసిన మహాపాపం ఊరికే పోదంటూ శాపనార్థాలు పెట్టారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్న జగన్ పాపం పండిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

‘‘హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయాలనే తలంపుతో శిశుపాలుడిలా మీ నూరు తప్పులు పూర్తి అయ్యాయి జగన్. ఇప్పటికైన ఆ భగవంతుడి ముందు తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుని పూజలు చేయండి. చేసిన పాపానికి కొంత వరకు అయినా పరిహారం దొరుకుతుంది. ఎందుకంటే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. పవిత్ర తిరుమలలో, కొండపైకి వెళ్లే ఆర్టీసీ టికెట్ల మీద అన్యమత ప్రచారం చేసిన పాపం.. పవిత్ర తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చిన పాపం.. తిరుమల కొండను అపవిత్రం చేసిన పాపం.. అత్యంత ఘోరంగా స్వామి వారి లడ్డూ(Laddu) తయారీలో మీరు చేసిన మహా పాపం ఊరికే వదలవు’’ అని ఆయన(Atchannaidu) పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Read Also: ‘దేవర’ ఈవెంట్ రద్దుకు అసలు కారణం అదే: కేటీఆర్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీడీపీలో చేరతా.. అభివృద్ధికి కృషి చేస్తా: తీగల కృష్ణారెడ్డి

త్వరలోనే టీడీపీలో చేరనున్నానంటూ మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy)...

మేమేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు: ఓవైసీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలపై ఎంఐఎం అధినేత ఓవైసీ(Asaduddin Owaisi)...